సేవాదళ్ యూత్ బ్రిగేడ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్వతి గణేష్ రెడ్డి

నూతన అధ్యక్షుడికి రేపల్లె శ్రీ రంగనాథ్ అభినందనలు హైదరాబాద్ , నవంబర్ 05,(తరంగాలు ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ కాంగ్రెస్ యూత్ బ్రిగేడ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన పార్వతి గణేష్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రేపల్లె శ్రీ రంగనాథ్ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేపల్లె శ్రీ రంగనాథ్ మాట్లాడుతూ.. గణేష్ రెడ్డి నాయకత్వంలో సేవాదళ్ యువజన విభాగం రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువతను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాల వైపు ఆకర్షిస్తూ పార్టీ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంపొందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, సేవాభావం, అంకితభావంతో పార్టీ బలోపేతానికి,...