వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డికి ఘన సన్మానం

రైతుల సంక్షేమానికి అంకితభావంతో కృషి చేయాలి: డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ వర్ధన్నపేట, నవంబర్ 05, తరంగాలు ప్రతినిధి: వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన అబ్బిడి రాజిరెడ్డి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ పార్టీ మండల, డివిజన్ అధ్యక్షుల సమక్షంలో రాజిరెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ.. అబ్బిడి రాజిరెడ్డి పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషకరమని అన్నారు. రైతుల సంక్షేమం, సహకార రంగ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. ఈ పదవి ఆయనకు మరిన్ని...