పెంచిన పన్నులను వెంటనే రద్దు చేయాలి: కొర్ర సుమలత
ములుగు పట్టణ బంద్కు వ్యాపారులు, విద్యాసంస్థలు, ప్రజలు సంపూర్ణ మద్దతు తెలపాలి సామాన్య ప్రజలపై పన్నుల భారం మోపడం సరికాదు – బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కొర్ర సుమలత ములుగు, నవంబర్ 19(తరంగాలు ప్రతినిధి ): ములుగు పట్టణంలో అడ్డగోలుగా పెంచిన పన్నుల కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని బీజేపీ మహిళా మోర్చా ములుగు జిల్లా అధ్యక్షురాలు కొర్ర సుమలత అన్నారు. పట్టణ ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా పన్నులు పెంచడం వల్ల మధ్యతరగతి, పేద కుటుంబాలపై అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై భారం మోపేలా పెంచిన పన్నులను తక్షణమే తగ్గించి,...