డా. వన్నాల వెంకటరమణ నివాసానికి విచ్చేసిన త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి
వన్నాల కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించిన గవర్నర్ మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములును పరామర్శించి యోగక్షేమాల ఆరా హనుమకొండ, నవంబర్ 22 (తరంగాలు ప్రతినిధి): త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి వరంగల్ పర్యటనలో భాగంగా ఆదివారం హనుమకొండలోని అడ్వకేట్ కాలనీలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. వన్నాల వెంకటరమణ నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వన్నాల వెంకటరమణ తన కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులతో కలిసి గవర్నర్కు ఘన స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములును ఆప్యాయంగా పలకరించి, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వన్నాల శ్రీరాములు సతీమణి స్వర్గీయ...