EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పడిదల నవీన్ కుమార్‌కు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ 2026 ఎక్సలెన్స్ అవార్డు’

    Author THARANGALU NEWS | 04 Aug 2026, 07:29 AM | TELANGANA
    పడిదల నవీన్ కుమార్‌కు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ 2026 ఎక్సలెన్స్ అవార్డు’

    కార్పొరేట్ సివిల్ అండ్ ఇంటీరియర్ సొల్యూషన్స్‌లో ప్రతిభకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు

    గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా,సోనూ సూద్ అవార్డు అందుకున్న నవీన్ కుమార్

    హైదరాబాద్, ఆగస్టు 3, తరంగాలు , :హైదరాబాద్ నగరంలోని నోవోటల్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో యువ పారిశ్రామికవేత్త పడిదల నవీన్ కుమార్ ప్రతిష్ఠాత్మక ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ 2026 ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ సివిల్ అండ్ ఇంటీరియర్ సొల్యూషన్స్ అవార్డు’ ను అందుకున్నారు.
    గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా సమక్షంలో ప్రముఖ నటుడు, సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన సోనూ సూద్ చేతుల మీదుగా నవీన్ కుమార్ ఈ అవార్డును స్వీకరించారు.ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ, గవర్నర్ సమక్షంలో సోనూ సూద్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం తనకు ఎంతో గౌరవంగా ఉందన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపును అందించిన ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
    ఈ అవార్డు తన విజయానికి సహకరించిన క్లయింట్లు, పీ హెచ్ ఎస్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ అంకితం చేస్తున్నట్లు నవీన్ కుమార్ పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

    పడిదల నవీన్ కుమార్‌కు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ 2026 ఎక్సలెన్స్ అవార్డు’ - Additional Imageపడిదల నవీన్ కుమార్‌కు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ 2026 ఎక్సలెన్స్ అవార్డు’ - Additional Image