EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ.. డ్రైవర్ మృతి

    Author THARANGALU NEWS | 13 Aug 2026, 10:14 AM | TELANGANA
    ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ.. డ్రైవర్ మృతి

    మహబూబాబాద్, ఆగస్టు 13, తరంగాలు : మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంధంపల్లి–ఇల్లెందు ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సాయి తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
    ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
    మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.