EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చలో అసెంబ్లీకి బ్రేకులు..!

    Author THARANGALU NEWS | 07 Sep 2026, 09:40 AM | TELANGANA
    చలో అసెంబ్లీకి బ్రేకులు..!

    బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ హౌస్ అరెస్ట్

    విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా..? కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీజేపీ నేత

    చలో అసెంబ్లీకి బ్రేకులు..! - Additional Image

    వరంగల్ ప్రతినిధి, సెప్టెంబర్ 7,తరంగాలు : విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు పిలుపు మేరకు చేపట్టిన “చలో అసెంబ్లీ” కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు మిల్స్ కాలనీ పోలీసులు శివనగర్‌లోని తన నివాసంలో తనను హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాల ప్రజా ఉద్యమాలను పోలీసు బలగాలతో అణచివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.

    ఇవి కూడా చదవండి

    *“అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు”*

    రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని గంట రవికుమార్ విమర్శించారు. విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
    ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేయడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరని ఆయన హెచ్చరించారు. ఎన్ని నిర్బంధాలు, అరెస్టులు ఎదురైనా విద్యార్థుల పక్షాన బీజేపీ పోరాటం ఆగదని, సమస్య పరిష్కారమయ్యే వరకు క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
    “విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదు. ప్రజాస్వామ్య హక్కులను గౌరవించి, విద్యార్థుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి” అని గంట రవికుమార్ డిమాండ్ చేశారు.