EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆర్థికంగా ఎదగాలి.. వ్యాపారాల్లో దూసుకెళ్లాలి

    Author THARANGALU NEWS | 11 Sep 2026, 08:08 AM | TELANGANA
    ఆర్థికంగా ఎదగాలి.. వ్యాపారాల్లో దూసుకెళ్లాలి

    -ఏపీఎం రమణాచారి


    ఘనంగా బృందావనం మహిళ సమైక్య 10వ వార్షికోత్సవం

    ఆర్థికంగా ఎదగాలి.. వ్యాపారాల్లో దూసుకెళ్లాలి - Additional Image



    వర్ధన్నపేట, సెప్టెంబర్ 10, తరంగాలు ప్రతినిధి: మహిళలు రంగాల్లో ఆర్థికంగా ఎదగాలి.. వ్యాపారాల్లో దూసుకెళ్లాలని
    ఏపీఎం రమణాచారి పిలుపునిచ్చారు.
    వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో బృందావనం మండల మహిళ సమైక్య 10వ వార్షికోత్సవ మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
    ఈ సందర్భంగా ఏపీఎం రమణాచారి మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి సభ్యులంతా సమష్టిగా కృషి చేయాలని సూచించారు. సంఘాల ద్వారా పొందుతున్న రుణాలను సద్వినియోగం చేసుకుని, వాటిని సకాలంలో చెల్లిస్తూ రుణాల రికవరీపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు.
    మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు రుణాలను పెట్టుబడులుగా వినియోగించి వివిధ వ్యాపారాలను ప్రారంభించాలని సూచించారు. వ్యాపార రంగంలో రాణించడం ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు సమాజ అభివృద్ధిలోనూ మహిళలు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
    ఈ కార్యక్రమంలో బృందావనం మహిళ సమైక్య అధ్యక్షురాలు ప్రమీల, కార్యదర్శి స్వర్ణలత, కోశాధికారి కల్పన, సీసీలు అనిత,రమ,రేణుక కంప్యూటర్ ఆపరేటర్ మురళీమోహన్, వీవోఏలు, మండల సమాఖ్య సిబ్బంది, వివిధ గ్రామాల మహిళా సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు
    .

    ఇవి కూడా చదవండి

    ఆర్థికంగా ఎదగాలి.. వ్యాపారాల్లో దూసుకెళ్లాలి - Additional Imageఆర్థికంగా ఎదగాలి.. వ్యాపారాల్లో దూసుకెళ్లాలి - Additional Image