EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇందిరమ్మ కాలనీ ఫేస్–1 గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా కుంభం శివపటేల్

    Author THARANGALU NEWS | 21 Sep 2026, 07:51 AM | TELANGANA
    ఇందిరమ్మ కాలనీ ఫేస్–1  గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా కుంభం శివపటేల్

    వరంగల్ ప్రతినిధి, సెప్టెంబర్ 20,తరంగాలు : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ ఎనుమాముల ఇందిరమ్మ కాలనీ ఫేస్–1 (ముసలమ్మకుంట) గ్రామంలో నూతన కాలనీ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది కాలనీ సభ్యుల సమక్షంలో కుంభం శివపటేల్‌ ను కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఏకగ్రీవంగా ప్రజలు చేతులు ఎత్తి మద్దతు తెలియజేయడం జరిగింది.కాలనీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తూ కాలనీ ప్రజలందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సభ్యులు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కుంభం శివపటేల్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న కాలనీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాలనీ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

    ఇందిరమ్మ కాలనీ ఫేస్–1  గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా కుంభం శివపటేల్ - Additional Imageఇందిరమ్మ కాలనీ ఫేస్–1  గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా కుంభం శివపటేల్ - Additional Image