EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఈగ మల్లేశంకు “సంకీర్తన” జీవిత సాఫల్య పురస్కారం

    Author THARANGALU NEWS | 27 Sep 2026, 04:01 PM | Cinema, TELANGANA
    ఈగ మల్లేశంకు “సంకీర్తన” జీవిత సాఫల్య పురస్కారం

    ఓరుగల్లు బిడ్డకు రవీంద్రభారతిలో అపూర్వ గౌరవం...కిరీటధారణతో ఘనంగా సన్మానం


    “సంకీర్తన జీవిత సాఫల్య పురస్కారం”తో కళాసేవకు దక్కిన అరుదైన గౌరవం

    “కళాకారులను గౌరవించడం అంటే సమాజాన్ని గౌరవించుకోవడమే”

    ఈగ మల్లేశంకు “సంకీర్తన” జీవిత సాఫల్య పురస్కారం - Additional Image

    ఈగ మల్లేశం కీలక వ్యాఖ్యలు

    కళామతల్లి సేవలో బాధ్యత మరింత పెరిగింది

    ఇవి కూడా చదవండి


    హైదరాబాద్, సెప్టెంబర్ 27, తరంగాలు ప్రతినిధి : హైదరాబాద్‌లోని ప్రసిద్ధ రవీంద్రభారతి వేదికగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, సంకీర్తన కల్చరల్ సొసైటీ, ఎస్‌.ఎన్‌. మ్యూజిక్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సంకీర్తన 14వ, ఎస్‌.ఎన్‌. మ్యూజిక్ 22వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
    ఈ సందర్భంగా కళారంగానికి, సమాజానికి ఈగ మల్లేశం అందిస్తున్న విశేష సేవలను నిర్వాహకులు కొనియాడారు. అనంతరం ఆయనను వేదికపై సాంప్రదాయబద్ధంగా శాలువా కప్పి, పూలమాలతో సత్కరించడంతో పాటు ప్రత్యేకంగా కిరీటధారణ చేసి ఘనంగా సన్మానించారు. అనంతరం “సంకీర్తన జీవిత సాఫల్య పురస్కారం” అందజేశారు.
    ఈ సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడుతూ “ఓరుగల్లు.. వరంగల్ గడ్డ కళామతల్లికి పుట్టినిల్లు. ఎందరో మహానుభావులు, వీరులు, అద్భుతమైన కళాకారులను అందించిన ఈ నేల మన సంస్కృతికి నిలువుటద్దం” అని అన్నారు. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం నుంచి వచ్చిన తనకు రవీంద్రభారతి వేదికపై “సంకీర్తన జీవిత సాఫల్య పురస్కారం”తో పాటు అపూర్వ సత్కారం దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు.
    ఈ గౌరవం కళామతల్లి సేవలో తన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, లలిత కళలను పరిరక్షిస్తూ భావితరాలకు అందించేందుకు సంకీర్తన కల్చరల్ సొసైటీ, ఎస్‌.ఎన్‌. మ్యూజిక్ అకాడమీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
    కళాకారులను ప్రోత్సహించడం ద్వారానే సమాజంలో సాంస్కృతిక వైభవం వెల్లివిరుస్తుందని ఆయన అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కళాకారుల సంక్షేమానికి సంక్షేమ మండలి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కళామతల్లి సేవలో నిమగ్నమై పనిచేస్తున్న సంస్థలను ప్రభుత్వం, సమాజం మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
    “కళాకారుడు ఆకలితో అలమటించకూడదు.. ఆయన కళ సమాజానికి మార్గదర్శకంగా నిలవాలి” అని ఈగ మల్లేశం ఆకాంక్షించారు. సంకీర్తన కల్చరల్ సొసైటీ, ఎస్‌.ఎన్‌. మ్యూజిక్ అకాడమీ చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, ఇలాంటి సంస్థలను ప్రభుత్వం, సమాజం, ప్రతి ఒక్కరూ ఆదరించి ప్రోత్సహించినప్పుడే మన సంస్కృతి సజీవంగా ఉంటుందన్నారు. కళాకారులను గౌరవించడం అంటే మన సంస్కృతిని, మన సమాజాన్ని మనమే గౌరవించుకోవడమేనని ఆయన పేర్కొన్నారు.

    ఈగ మల్లేశంకు “సంకీర్తన” జీవిత సాఫల్య పురస్కారం - Additional Imageఈగ మల్లేశంకు “సంకీర్తన” జీవిత సాఫల్య పురస్కారం - Additional Imageఈగ మల్లేశంకు “సంకీర్తన” జీవిత సాఫల్య పురస్కారం - Additional Image