EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆయిల్‌ఫామ్ రైతుల మండల అధ్యక్షుడిగా తక్కలపల్లి సత్యనారాయణరావు

    Author THARANGALU NEWS | 06 Oct 2026, 06:37 PM | TELANGANA
    ఆయిల్‌ఫామ్ రైతుల మండల అధ్యక్షుడిగా తక్కలపల్లి సత్యనారాయణరావు

    ఏకగ్రీవంగా ఎన్నిక.. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ


    వర్ధన్నపేట, అక్టోబర్ 06 (తరంగాలు ప్రతినిధి ): వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ రైతు వేదికలో నిర్వహించిన ఆయిల్‌ఫామ్ రైతుల మండల కమిటీ ఏర్పాటు సమావేశంలో ఇల్లంద గ్రామానికి చెందిన తక్కలపల్లి సత్యనారాయణరావు మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయిల్‌ఫామ్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
    ఈ సందర్భంగా అధికారులు ఆయిల్‌ఫామ్ సాగులో పాటించాల్సిన శాస్త్రీయ పద్ధతులు, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణ, మొక్కల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రీయ పద్ధతులతో సాగు చేస్తే మెరుగైన దిగుబడులు, ఆదాయం పొందవచ్చని సూచించారు.
    తక్కలపల్లి సత్యనారాయణరావు అధ్యక్షతన మండల కమిటీ రైతుల సమస్యలను గుర్తించి వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఆయిల్‌ఫామ్ సాగు అభివృద్ధికి కృషి చేయాలని రైతులు ఆకాంక్షించారు. నూతన కమిటీకి రైతులు అభినందనలు తెలిపారు.
    మండల కమిటీ గౌరవ అధ్యక్షుడిగా గుజ్జ గోపాల్‌రావు, ఉపాధ్యక్షులుగా జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి, బోయిన్పల్లి దేవేందర్‌రావు, పెంచాల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా గుజ్జ రాజేశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా పెండ్యాల బిక్షపతి, కోశాధికారిగా నాంపల్లి మల్లేశం, కార్యవర్గ సభ్యులుగా బాషబోయిన రాజు, మునుకుంట్ల ఐలయ్య, ఎర్రం నాగరాజు, ఏలపాటి తిరుపతిరెడ్డి ఎన్నికయ్యారు.
    ఈ నెల 8న గీసుకొండలో నిర్వహించనున్న జిల్లా స్థాయి ఆయిల్‌ఫామ్ రైతుల సభకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి కోరారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు, ఏఈఓలు, ఆయిల్‌ఫామ్ రైతులు పాల్గొన్నారు.

    ఆయిల్‌ఫామ్ రైతుల మండల అధ్యక్షుడిగా తక్కలపల్లి సత్యనారాయణరావు - Additional Image