EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అయ్యప్పస్వామి పాదసేవలో... "పడిదల మహాలక్ష్మి నవీన్ కుమార్"

    Author THARANGALU NEWS | 09 Oct 2026, 09:13 PM | TELANGANA
    అయ్యప్పస్వామి పాదసేవలో... "పడిదల మహాలక్ష్మి నవీన్ కుమార్"

    భక్తి,సేవ,దాతృత్వానికి ప్రతీకగా పడిదల కుటుంబం

    మణికంఠుడి సేవలో నవీన్ కుమార్ దంపతుల ఆధ్యాత్మిక అంకితభావం

    అయ్యప్పస్వామి పాదసేవలో... "పడిదల మహాలక్ష్మి నవీన్ కుమార్" - Additional Image

    అయ్యప్పస్వామి ఆలయానికి రూ.11 లక్షల మహా విరాళం.. ఔదార్యం చాటుకున్న నవీన్ కుమార్ దంపతులు

    అయ్యప్పస్వామికి అష్టాభిషేకాలు,పల్లకిసేవ

    అయ్యప్పస్వామి పాదసేవలో... "పడిదల మహాలక్ష్మి నవీన్ కుమార్" - Additional Image

    అయ్యప్పస్వామి ఆశీస్సులతో ప్రజాసేవే లక్ష్యంగా నవీన్ కుమార్


    నర్సంపేట , అక్టోబర్ 09 (): నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయంలో నిర్వహించిన 21వ ఉత్తర ఫల్గుణ నక్షత్ర పడిపూజ మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, ముత్తోజిపేట గ్రామానికి చెందిన పడిదల మహాలక్ష్మి నవీన్ కుమార్ దంపతులు ప్రత్యేక భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అయ్యప్పస్వామికి అష్టాభిషేకాలు, మహాకలశాభిషేకం, పుష్పాభిషేకం, పంబా ఆరాట్టు, పల్లకిసేవ నిర్వహించడంతో పాటు అన్నప్రసాద వితరణకు దాతలుగా వ్యవహరించారు. ఆలయ పునర్నిర్మాణానికి శాశ్వత స్థలదాతగా రూ.11 లక్షల విరాళాన్ని ప్రకటించి తమ భక్తిభావాన్ని, సేవా దృక్పథాన్ని చాటుకున్నారు.

    ఇవి కూడా చదవండి

    అయ్యప్పస్వామి పాదసేవలో... "పడిదల మహాలక్ష్మి నవీన్ కుమార్" - Additional Image

    *వైభవంగా పడిపూజ మహోత్సవం*

    అయ్యప్పస్వామి దేవాలయ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన మహోత్సవం భక్తజన సందోహం మధ్య వైభవంగా సాగింది. ఆలయ ప్రధాన అర్చకులు దేవేష్ మిశ్రా మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పదునెట్టాంబడిపై నిర్వహించిన పడిపూజతో ఆలయ ప్రాంగణం దివ్యకాంతులతో వెలిగిపోయింది. అయ్యప్పస్వామి నామస్మరణ, శరణుఘోష, భజనలతో ఆలయం మారుమోగింది. కళ్యాణరాముడు, రంగనాథ్ బృందం ఆలపించిన భక్తి గీతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

    *మాడవీధుల్లో స్వామివారి పల్లకిసేవ*

    పడిపూజ అనంతరం పడిదల మహాలక్ష్మి నవీన్ కుమార్ దంపతులు స్వామివారి పల్లకిసేవలో పాల్గొని, మంగళవాయిద్యాలు, భక్తుల నృత్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగింపును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీకి వెంకటేశ్వరస్వామి పంచలోహ విగ్రహాన్ని అందజేశారు. అనంతరం నవీన్ కుమార్ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

    *ఆలయ పునర్నిర్మాణానికి రూ.11 లక్షల విరాళం*

    శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు అండగా నిలిచేందుకు పడిదల మహాలక్ష్మి నవీన్ కుమార్ దంపతులు శాశ్వత స్థలదాతగా రూ.11 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా అందజేయనున్నట్లు నవీన్ కుమార్ వెల్లడించారు.

    *ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ..* ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచనల మేరకు ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. అయ్యప్ప దీక్ష భక్తిని, క్రమశిక్షణను పెంపొందించడంతో పాటు ప్రజలను సన్మార్గంలో నడిపించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు తమ వంతు సహకారం అందించాలని ఆకాంక్షించారు.
    ఈ కార్యక్రమంలో ఆలయ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు సైఫా సురేష్, ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి, కోశాధికారి దొడ్డ రవీందర్, స్థలదాతలు చెంచారావు, సాంబయ్య గౌడ్, రాజు, శ్రీరామ్ ఈశ్వరయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ, వీణ విజేందర్ రెడ్డి, వేముల నవీన్, దూపటి కుమారస్వామి, చిదిరాల రామ్ రెడ్డి, కేశపాక సాంబయ్య, కట్టస్వామి, కత్తి కిరణ్ గౌడ్, గజ్జి రాజు, బనోత్ మైబు, పూలుగుల మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురుస్వాములు, భక్తులు, స్థానిక ప్రముఖులు కలిపి సుమారు 700 మంది హాజరై మహోత్సవాన్ని విజయవంతం చేశారు.