EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఓటు హక్కే ప్రజాస్వామ్యానికి పునాది!

    Author THARANGALU NEWS | 01 Nov 2026, 12:58 PM | TELANGANA
    ఓటు హక్కే ప్రజాస్వామ్యానికి పునాది!

    ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగొద్దు

    న్యూఢిల్లీలో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమంలో
    ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

    ఇవి కూడా చదవండి

    న్యూఢిల్లీ, నవంబర్ 01,(తరంగాలు ప్రతినిధి): ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు న్యూఢిల్లీలో ఎస్‌ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియకు వ్యతిరేకంగా నిర్వహించిన “ఓట్ బచావో – దేశ్ బచావో” కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాలని, ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
    ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బొక్కల ప్రమోద్, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకుడు బిర్రు రాజు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ కుల్ల యాకాంతం తదితర యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.