EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ సందీప్‌తో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు భేటీ

    Author THARANGALU NEWS | 27 Nov 2026, 01:17 PM | TELANGANA
    ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ సందీప్‌తో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు భేటీ

    కాంగ్రెస్ పార్టీ బలోపేతం, వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ


    హైదరాబాద్, నవంబర్ 27 (తరంగాలు ప్రతినిధి):
    హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ బి.ఎం. సందీప్‌ను వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.
    ఈ భేటీలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత సంస్థాగతంగా బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై చర్చించారు. అదేవిధంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై చర్చించారు.
    నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వ సహకారం, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో అమలు చేయాల్సిన కార్యక్రమాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
    ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జాతీయ మాల మహానాడు ఉపాధ్యక్షులు బాబురావు, హనుమకొండ జిల్లా జేబీఎం చైర్మన్ జన్నపురెడ్డి రుగ్వేద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ సందీప్‌తో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు భేటీ - Additional Image