EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అక్రమ అరెస్టులతో బిజెపి నాయకులను భయపెట్టలేరు

    Author THARANGALU NEWS | 22 Jul 2026, 04:01 PM | TELANGANA
    అక్రమ అరెస్టులతో బిజెపి నాయకులను భయపెట్టలేరు

    ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పిరికిపంద చర్య

    కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత నీచంగా వ్యవహరిస్తుంది

    అక్రమ అరెస్టులతో బిజెపి నాయకులను భయపెట్టలేరు - Additional Image

    కాంగ్రెస్ పార్టీ నియంతృత్వానికి, ద్వంద్వ వైఖరికి ఈ అక్రమ అరెస్టులు నిదర్శనం

    ఇవి కూడా చదవండి

    బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ

    అక్రమ అరెస్టులతో బిజెపి నాయకులను భయపెట్టలేరు - Additional Image

    హైదరాబాద్, జులై 22,తరంగాలు : అక్రమ అరెస్టులతో బిజెపి నాయకులను భయపెట్టలేరని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ అన్నారు.నేడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయం నుండి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (గాంధీ భవన్) వరకు నిరసన (గెరావ్) కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తో డాక్టర్ వన్నాల వెంకట రమణ పాల్గొన్నారు.
    మంగళవారం ఢిల్లీ లోని ప్రధాని నివాసాన్ని కాంగ్రెస్ పార్టీ ముట్టడించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో తమ తప్పును ఎండగడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు తో మరియు ఇతర శాసనసభ్యులు , రాష్ట్ర నాయకులతో ప్రెస్ మీట్ లో పాల్గొన్న అనంతరం రాష్ట్ర బీజేపీ కార్యాలయం నుండి గాంధీ భవన్ వరకు నిరసన గెరవ్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకట రమణ పాల్గొన్నారు.
    ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ వన్నాల వెంకట రమణ ను పోలీసులు అరెస్ట్ చేసి అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.
    ఈ సందర్బంగా డాక్టర్ వన్నాల వెంకటరమణ మాట్లాడుతూ
    ఇది ముమ్మాటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పిరికిపంద చర్య అని,ఒకవైపు ఢిల్లీలో ప్రజాస్వామ్యం ముసుగులో విధ్వంసాలు సృష్టిస్తూ, రాష్ట్రంలో మాత్రం పోలీసుల అండతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడటం కాంగ్రెస్ పార్టీ నియంతృత్వానికి, ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని మండిపడ్డారు.
    పోలీసు నిర్బంధాలతో, అక్రమ అరెస్టులతో బిజెపి నాయకులను, కార్యకర్తలను ఎవరూ భయపెట్టలేరని,కాంగ్రెస్ అప్రజాస్వామిక, అరాచక విధానాలపై బిజెపి పోరాటం ఆగదు అని వారు అన్నారు.
    ఈ నిరసన కార్యక్రమం లో శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి, శ్రీ పాల్వాయి హరీష్ బాబు , రాష్ట్ర ఉపాధ్యక్షుడు కసం వెంకటేశ్వర్లు, ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు బసవ లక్ష్మి నర్సయ్య , అధికార ప్రతినిధి డాక్టర్ ప్రభ మరియు రాష్ట్ర బీజేపీ నాయకులు, రాష్ట్ర మహిళ నాయకులు, పదాధికారులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

    అక్రమ అరెస్టులతో బిజెపి నాయకులను భయపెట్టలేరు - Additional Image