EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వరంగల్ విమానాశ్రయ ప్రాజెక్టు పనులును వేగవంతం చెయ్యాలి

    Author THARANGALU NEWS | 10 Aug 2026, 04:43 PM | NATIONAL
    వరంగల్ విమానాశ్రయ ప్రాజెక్టు పనులును వేగవంతం చెయ్యాలి

    కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కలిసి,కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ బీజేపీ బృందం!

    న్యూఢిల్లీ, ఆగస్టు 10,తరంగాలు :వరంగల్ విమానాశ్రయ ప్రాజెక్టు పనులును వేగవంతం చెయ్యాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని తెలంగాణ బీజేపీ బృందం కలిసి కృతజ్ఞతలు తెలిపారు.వరంగల్-మామునూరు విమానాశ్రయ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక ఆమోదం తెలిపినందుకు గాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తో పాటు మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ ఆజ్మీరా సీతారామ్ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
    ఈ మేరకు అదిలాబాద్ లోకసభ సభ్యులు గోడెం నగేష్,ప్రొఫెసర్ ఆజ్మీరా సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా వన్నాల వెంకటరమణ లతో కూడిన బీజేపీ నాయకుల బృందం
    న్యూఢిల్లీలో జోర్బాగ్ సాఫదారగంజ్ లోని కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యాలయంలో మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఒక అధికారిక లేఖ అందజేశారు.
    తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజల దశాబ్దాల కాలం నాటి చిరకాల వాంఛ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చూపిన చొరవ, ప్రత్యేక శ్రద్ధ అభినందనీయమని సీతారామ్ నాయక్ పేర్కొన్నారు. తాను మహబూబాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో వరంగల్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశానని, ఈ రోజు ఆ కల నెరవేరుతుండటం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని లేఖలో ఆజ్మీరా స్మరించుకున్నారు.
    బాధ్యతలు స్వీకరించిన కొత్తలో కేంద్ర మంత్రితో జరిగిన భేటీని గుర్తుచేసుకుంటూ..రామ్మోహన్ నాయుడి నిరాడంబరత, అందుబాటులో ఉండే స్వభావం మరియు చురుకైన నాయకత్వం స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.
    ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని వరంగల్ పర్యటనకు విచ్చేయాల్సిందిగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ను బీజేపీ బృందం ఆహ్వానించింది. మామునూరు విమానాశ్రయ ప్రాజెక్టు శంకుస్థాపన లేదా అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై,ఈ ప్రాంత ప్రజలను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
    కేంద్ర మంత్రి రాక తెలంగాణ ప్రాంత అభివృద్ధికి,కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా అదిలాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి వెంటనే శ్రీకారం చుట్టాలని అదిలాబాద్ లోకసభ సభ్యులు గోడెం నగేష్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ను కోరారు.
    అలాగే మామునూరు విమానాశ్రయంలో భూములు కోల్పోయిన కుటుంబాలకు మరియు సమీప ప్రాంతం లోని ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకట రమణ* లు మంత్రి ని కోరారు.
    వీరి విజ్ఞప్తులను అంగీకరించి కేంద్ర మంత్రి పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
    ఈ సందర్బంగా కేంద్ర మంత్రివర్యులను బీజేపీ బృందం సత్కరించింది.

    వరంగల్ విమానాశ్రయ ప్రాజెక్టు పనులును వేగవంతం చెయ్యాలి  - Additional Imageవరంగల్ విమానాశ్రయ ప్రాజెక్టు పనులును వేగవంతం చెయ్యాలి  - Additional Image