EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సేవకు చిరునామా. వాక్ ఫౌండేషన్

    Author THARANGALU NEWS | 21 Aug 2026, 06:51 PM | TELANGANA
    సేవకు చిరునామా. వాక్ ఫౌండేషన్

    సేవే లక్ష్యంగా .. ‘వాక్’ పయనం

    నిరుపేదలకు చేయూత.. విద్యార్థులకు ప్రోత్సాహం.. ఆపదలో ఆర్థిక సాయం

    సేవకు చిరునామా. వాక్ ఫౌండేషన్ - Additional Image

    పేదల కన్నీరు తుడుస్తూ..చేయూతనందిచడంలో ‘వాక్’ ప్రత్యేకత

    ఇవి కూడా చదవండి


    నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న వాక్ ఫౌండేషన్

    సేవకు చిరునామా. వాక్ ఫౌండేషన్ - Additional Image


    రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన డాక్టర్ వన్నాల వెంకటరమణ


    వరంగల్ ప్రతినిధి, ఆగస్టు 21,తరంగాలు :
    నిరుపేదలకు చేయూత.. విద్యార్థులకు ప్రోత్సాహం.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఆర్థిక భరోసాను అందిస్తూ పేద విద్యార్థుల చదువుకు అండగా నిలుస్తూ వాక్ ఫౌండేషన్ మానవత్వానికి చిరునామాగా నిలుస్తోంది.
    ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ, చదువుకు దూరం కాకుండా విద్యార్థులను ప్రోత్సహిస్తూ డాక్టర్ వన్నాల వెంకటరమణ ఆధ్వర్యంలో వాక్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు పలువురి హృదయాలను తాకుతున్నాయి.
    “సాయం చిన్నదైనా.. అది ఒక కుటుంబానికి పెద్ద భరోసా” అనే భావనతో సాగుతున్న ఈ సేవా కార్యక్రమాలు నిరుపేదల జీవితాల్లో ఆశాకిరణాలుగా నిలుస్తున్నాయి.
    వరంగల్ తూర్పు నియోజకవర్గం 23వ డివిజన్ కొత్తవాడకు చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త గాజర్ల విజయ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, ఆయన కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కష్టాల్లో తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.
    విజయ్ కుమార్తె గాజర్ల దేవన్షు చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా వాక్ ఫౌండేషన్ ద్వారా రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదేవిదంగా వరంగల్,
    కరీమాబాద్, 39వ డివిజన్ (ఎస్ ఆర్ ఆర్ తోట ప్రాంతానికి) చెందిన వరంగల్ వారియర్ క్రికెట్ ప్లేయర్ విశ్వనాథ్ వైష్ణవ్ గత నెలలో హైదరాబాద్ లోని ఎల్.బి స్టేడియం లో ప్రాక్టీస్ చేసి బయటకు వేస్తున్న సమయంలో రోడ్ ఆక్సిడెంట్ వలన సుమారుగా 20 రోజులు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి వాక్ ఫౌండేషన్ ద్వారా రూ.8 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటు అందించడం, ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్న డాక్టర్ వన్నాల వెంకటరమణను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
    వాక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు ప్రతినెలా బియ్యం పంపిణీ, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, పరీక్షల సమయంలో విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ పంపిణీ, పేద విద్యార్థుల స్కూల్ ఫీజుల కోసం ఆర్థిక సహాయం వంటి పలు సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
    విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం.. పేద కుటుంబాలకు చేయూత.. ఆరోగ్య సేవలకు భరోసా అనే లక్ష్యంతో వాక్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు స్థానికంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. రాజకీయాలకు అతీతంగా అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
    ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ షా, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముండ్రాతి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు విప్ప సుధాకర్, సీతా నాగరాజు, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు వావిలాల శోభారాణి, మహిళా మోర్చా నాయకురాలు గాజర్ల సుశీల, కె.మౌనిక,గిర్మాజిపేట మండల అధ్యక్షుడు సీతానగరాజు , సీనియర్ నాయకులు ఆకుతోట రాజేందర్ , శివ, పలువురు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.