EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఫీజుల బకాయిలపై బీజేపీ రాజీలేని పోరాటం

    Author THARANGALU NEWS | 25 Aug 2026, 10:42 AM | TELANGANA
    ఫీజుల బకాయిలపై బీజేపీ రాజీలేని పోరాటం

    నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన డాక్టర్ వన్నాల వెంకట రమణ

    తక్షణమే రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్

    ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ‘బీజేపీ లడాయి

    ఫీజుల బకాయిలపై బీజేపీ రాజీలేని పోరాటం - Additional Image

    హైదరాబాద్, ఆగస్టు 25, తరంగాలు : విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకట రమణ సంఘీభావం తెలిపారు.
    బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తున్న “ఫీజుల బకాయి–బీజేపీ లడాయి” కార్యక్రమంలో మొదటి రోజు డాక్టర్ వన్నాల వెంకట రమణ పాల్గొన్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.
    ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో అవలంబిస్తున్న తీరుపై ఆయన విమర్శలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ దీక్షకు రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ తదితరులు హాజరై సంఘీభావం తెలిపారు. మొదటి రోజు విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలివచ్చి నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు.
    అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుకు సంఘీభావంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, డాక్టర్ వన్నాల వెంకట రమణలు రాత్రి నిరాహార దీక్ష శిబిరంలోనే బస చేశారు.

    ఇవి కూడా చదవండి

    ఫీజుల బకాయిలపై బీజేపీ రాజీలేని పోరాటం - Additional Imageఫీజుల బకాయిలపై బీజేపీ రాజీలేని పోరాటం - Additional Image