EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రాఖీ పండుగ వేళ కన్నీటి జ్ఞాపకం

    Author THARANGALU NEWS | 28 Aug 2026, 12:00 PM | TELANGANA
    రాఖీ పండుగ వేళ కన్నీటి జ్ఞాపకం

    ఏడేళ్ల క్రితం దూరమైన అన్న చిత్రపటానికి రాఖీ కట్టి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న చెల్లెలు

    వర్ధన్నపేట ప్రతినిధి, ఆగస్టు 28,తరంగాలు : రాఖీ పౌర్ణమి పండుగ అంటే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. అయితే కొందరి జీవితాల్లో ఆ పండుగ ఆనందంతో పాటు తీరని విషాదాన్ని కూడా మోసుకొస్తుంది. అలాంటి హృదయవిదారక దృశ్యమే ఇది.ఏడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గొడిశాల శ్రీనివాస్ కుమారుడు గొడిశాల రామ్ సాయి మృతి చెందారు. అన్నను కోల్పోయిన బాధను గుండెల్లో దాచుకున్న ఆయన చెల్లెలు లక్ష్మీ గాయత్రి, ఈ రాఖీ పండుగ సందర్భంగా అన్న జ్ఞాపకాలను తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
    జీవించి ఉన్నప్పుడు ప్రతి రాఖీ పండుగకూ అన్న చేతికి ప్రేమగా రాఖీ కట్టిన చెల్లెలు.. ఇప్పుడు అదే రాఖీని అన్న చిత్రపటానికి కట్టి తన ఆత్మీయతను చాటుకున్నారు. చిత్రపటం ముందు నిల్చొని రామ్ సాయితో గడిపిన చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
    అన్న ఇక తిరిగి రాడని తెలిసినా.. అన్నతో తన బంధం మాత్రం ఎప్పటికీ తన హృదయంలోనే ఉంటుందని లక్ష్మీ గాయత్రి భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. రాఖీ దారం చేతికి కట్టలేకపోయినా, ఆ దారంతో ముడిపడిన ప్రేమ మాత్రం కాలంతో పాటు చెరిగిపోదని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.
    “రాఖీ కట్టేది చేతికి కాదు…
    అన్నాచెల్లెళ్ల బంధాన్ని కట్టేది హృదయాలకు.
    అన్న దూరమైనా… అతని జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం చెల్లెలి గుండెల్లోనే ఉంటాయి.”
    రామ్ సాయి జ్ఞాపకాల్లో లక్ష్మీ గాయత్రి కట్టిన ఈ రాఖీ.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి కన్నీటి నివాళిగా నిలిచింది.

    రాఖీ పండుగ వేళ కన్నీటి జ్ఞాపకం - Additional Image