EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కృష్ణమయమైన ములుగు

    Author THARANGALU NEWS | 03 Sep 2026, 09:32 PM | TELANGANA
    కృష్ణమయమైన ములుగు

    *ములుగులో కన్నుల పండువగా బాలగోకులం*

    కృష్ణుడు, గోపికల వేషధారణలో 1,500 మంది విద్యార్థుల సందడి..

    కృష్ణమయమైన ములుగు - Additional Image

    26 ఏళ్లుగా కొనసాగుతున్న సాంస్కృతిక వేడుక

    **ములుగు చౌరస్తాలో అలరించిన శోభాయాత్ర*

    ఇవి కూడా చదవండి

    కృష్ణమయమైన ములుగు - Additional Image

    *ములుగు ప్రతినిధి , సెప్టెంబర్ 3,తరంగాలు :* శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్‌లో ధర్మ జాగరణ సమితి కన్వీనర్ గండ్ర కోట కుమార్ ఆధ్వర్యంలో బాలగోకులం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి 15 పాఠశాలలు సాధన స్కూల్, బ్రాహ్మణి స్కూల్ , సన్రైజర్స్ స్కూల్, వెంకటాపూర్ జోహార్ స్కూల్, అరవింద స్కూల్, బిట్స్ స్కూల్,, సెయింట్ ఆంథోనీస్ స్కూల్ , బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, మిరాకిల్ స్కూల్ ,వివేకవర్ధిని స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ , బండారుపల్లి మోడల్ స్కూల్ , జెడ్పీహెచ్ఎస్ బండారుపల్లి స్కూల్, భవాని స్కూల్ నుండి 1500 మంది విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలో పాల్గొని శోభాయాత్రలో అలరించారు.

    *ఈ సందర్బంగా ములుగు డీఎస్పీ రవీందర్ మాట్లాడుతూ*
    "బాలల్లో ఇలాంటి సాంస్కృతిక స్ఫూర్తిని నింపడం చాలా గొప్ప విషయం. శ్రీకృష్ణుడు ధర్మానికి, న్యాయానికి, స్నేహానికి ప్రతీక. చిన్ననాటి నుండే పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాల విలువలు తెలియజేయడం వల్ల భవిష్యత్తులో వారు మంచి పౌరులుగా ఎదుగుతారు. 26 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ధర్మ జాగరణ సమితికి నా అభినందనలు. విద్యార్థులు క్రమశిక్షణతో, ఉత్సాహంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.

    కృష్ణమయమైన ములుగు - Additional Image

    *మున్సిపల్ కమిషనర్ జే సంపత్ మాట్లాడుతూ*
    "ములుగు పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున బాలగోకులం జరగడం ఆనందంగా ఉంది. పట్టణం మొత్తం బృందావనంలా మారింది. పిల్లలు వేసిన ప్రతి వేషంలో భక్తి, సంప్రదాయం కనిపించింది. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో దేశభక్తిని, ధర్మం పట్ల అవగాహనను పెంచుతాయి. ఈ వేడుకకు సహకరించిన ప్రతి పాఠశాల యాజమాన్యానికి, తల్లిదండ్రులకు ధన్యవాదాలు. లహరి గ్రూప్ వారు విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం అభినందనీయం" అని అన్నారు.ఈ సందర్భంగా మధు ఫోటో స్టూడియో వారు ఉచిత ఫోటోగ్రఫీని అందించారు.

    *విశిష్ట అతిథి ఆర్ఎస్ఎస్ ప్రచారక్ విగ్నేష్ జీ మాట్లాడుతూ*
    "ధర్మ జాగరణ అంటే కేవలం ఒక కార్యక్రమం కాదు, అది మన సంస్కృతిని మేల్కొలపడం. శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా ఇచ్చిన సందేశం నేటికీ ప్రతి భారతీయునికి దిక్సూచి. బాల్యంలోనే పిల్లలకు గీతలోని ధర్మ సూక్ష్మాన్ని పరిచయం చేయాలి. 26 ఏళ్లుగా ఆగకుండా ఈ బాలగోకులాన్ని నిర్వహించడం ములుగు గడ్డ గొప్పతనం. ఇది ములుగు సంస్కృతికి నిదర్శనం. పిల్లలే మన దేశానికి భవిష్యత్తు, వారిలోనే కృష్ణుడిని చూడాలి" అని పేర్కొన్నారు.
    ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ శానిటేషన్ ఇన్స్పెక్టర్ తాళ్ల ఉదయ్ కుమార్, రామగిరి శ్రీనివాస్, ముక్కు సుబ్బారెడ్డి, కొర్ర సుమలత,మేడుదుల మమన్, కుసుమ రాజు,నూనె బిక్షపతి, సముద్రాల వినయ్, చిమట కృష్ణ, కొత్తపల్లి బాబురావు,యాద సంపత్, రాయించూ నాగరాజు, పాఠశాలల కరస్పాండెంట్లు ముద్దం సంతోష్, తుమ్మ పిచ్చిరెడ్డి,ఎండీ . ముజీఫ్, దుగ్గిరెడ్డి సురేందర్ రెడ్డి,, పెట్టెం రాజు, అక్కల సతీష్, కర్ర రాజేందర్ రెడ్డి, ఏరువ కవిత, కందాల రమేష్ , గిరగాని కవిత, భాగవతల నరసింహమూర్తి, ప్రసన్న కుమార్, శ్రీనివాస రావు,తడక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

    కృష్ణమయమైన ములుగు - Additional Imageకృష్ణమయమైన ములుగు - Additional Image