EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మహబూబాబాద్‌లో వెయ్యి రోజుల విజయోత్సవం

    Author THARANGALU NEWS | 05 Sep 2026, 07:56 PM | TELANGANA
    మహబూబాబాద్‌లో వెయ్యి రోజుల విజయోత్సవం


    సీఎం రేవంత్ రెడ్డి పాలనకు ప్రజా మద్దతు..

    ఉమా మురళి నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ బైక్ ర్యాలీ

    మహబూబాబాద్‌లో వెయ్యి రోజుల విజయోత్సవం - Additional Image


    మహబూబాబాద్ ప్రతినిధి, సెప్టెంబర్ 5,తరంగాలు :
    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబాబాద్‌లో విజయోత్సవ బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ అధ్యక్షత వహించారు.
    బైక్ ర్యాలీ అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమం,అభివృద్ధి, సామాజిక న్యాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందన్నారు.
    మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్, రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులకు సంక్షేమ కార్యక్రమాలు వంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
    అలాగే రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పన, రహదారులు, విద్య, వైద్యం, సాగునీరు తదితర రంగాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
    1000 రోజుల పాలనలో తెలంగాణ ప్రజలకు అందించిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ విజయోత్సవ బైక్ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని ఉమా మురళి నాయక్ తెలిపారు.
    కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి, సంక్షేమంతో తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆమె అన్నారు.
    ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ నియోజక వర్గంలోని కేసముద్రం మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరు సమ్మీ గౌడ్ ,గూడూరు మండల పార్టీ అధ్యక్షులు బాలాజీ నాయక్ ,మహబూబాబాద్ మండల పార్టీ అధ్యక్షులు బెల్లంకొండ శ్రీనివాస్, నెలకుదురు మండల పార్టీ అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి, ఇనుగుర్తి మండల పార్టీ అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ మండలాలకు చెందిన మండల పార్టీ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి

    మహబూబాబాద్‌లో వెయ్యి రోజుల విజయోత్సవం - Additional Imageమహబూబాబాద్‌లో వెయ్యి రోజుల విజయోత్సవం - Additional Imageమహబూబాబాద్‌లో వెయ్యి రోజుల విజయోత్సవం - Additional Imageమహబూబాబాద్‌లో వెయ్యి రోజుల విజయోత్సవం - Additional Image