EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాళోజీ జీవితం ఆదర్శప్రాయం

    Author THARANGALU NEWS | 09 Sep 2026, 05:33 PM | TELANGANA
    కాళోజీ జీవితం ఆదర్శప్రాయం

    ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం


    కాళోజీ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలి

    కాళోజీ జీవితం ఆదర్శప్రాయం - Additional Image

    బీజేపీ ములుగు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సుమలత

    ఇవి కూడా చదవండి

    ములుగు ప్రతినిధి , సెప్టెంబర్ 9, తరంగాలు :కాళోజీ నారాయణరావు జీవితం ఆదర్శప్రాయమని,
    ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని,కాళోజీ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని బీజేపీ ములుగు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సుమలత అన్నారు.
    ప్రజాకవి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా బీజేపీ ములుగు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సుమలత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
    ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావు తన కలం ద్వారా ప్రజల సమస్యలను, సామాజిక అసమానతలను, అన్యాయాలను ప్రశ్నించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు, స్వాభిమానం, ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు.
    “నా గొడవ” వంటి రచనల ద్వారా సమాజంలోని వాస్తవ పరిస్థితులను నిర్భయంగా ఎత్తిచూపిన కాళోజీ, సామాన్యుడి గొంతుకగా నిలిచారని సుమలత అన్నారు. పదవులు, ప్రలోభాలకు అతీతంగా ప్రజా సమస్యలపై స్పందించిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.
    కాళోజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని, సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సుమలత పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, మానవత్వం, సామాజిక న్యాయం కోసం కాళోజీ చూపిన మార్గాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భవాని, స్రవంతి, శశికాంత, స్వర్ణలత, అనూష, స్రవంతి, భవాని, శ్రీలత, లావణ్య పాల్గొన్నారు