EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు

    Author THARANGALU NEWS | 24 Sep 2026, 07:06 AM | TELANGANA
    భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు

    వరంగల్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్.. విద్యార్థుల భద్రత దృష్ట్యా కలెక్టర్ నిర్ణయం


    వరంగల్ ప్రతినిధి, సెప్టెంబర్ 23, తరంగాలు:
    వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వరంగల్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించినందున విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు గురువారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.
    ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సెలవు వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
    అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లవద్దని, వర్షాలు, వరదలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో వర్ష పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

    *24 గంటలు కంట్రోల్ రూమ్ సేవలు*

    ఇవి కూడా చదవండి

    జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజల సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 18004253424, 9154252936 నంబర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
    వర్షాలు, వరదల కారణంగా ఏదైనా అవాంఛనీయ సంఘటన చోటుచేసుకున్నా లేదా అత్యవసర సహాయం అవసరమైనా వెంటనే కంట్రోల్ రూమ్ నంబర్లకు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు.