EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాంగ్రెస్‌ బాటలో అబ్బిడి రాజిరెడ్డి.. రైతు సేవలో కొత్త పయనం!

    Author THARANGALU NEWS | 25 Sep 2026, 08:59 AM | TELANGANA
    కాంగ్రెస్‌ బాటలో అబ్బిడి రాజిరెడ్డి.. రైతు సేవలో కొత్త పయనం!

    అబిడి రాజిరెడ్డి రాజకీయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టం


    రైతు సేవే లక్ష్యంగా వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్‌గా కొత్త బాధ్యతలు

    కాంగ్రెస్‌ బాటలో అబ్బిడి రాజిరెడ్డి.. రైతు సేవలో కొత్త పయనం! - Additional Image

    కాంగ్రెస్‌కు అండగా.. రైతులకు కొండంత భరోసాగా అబ్బిడి రాజిరెడ్డి..!

    పార్టీ కోసం కష్టకాలంలోనూ నిబద్ధతతో పనిచేసిన నేత..

    కాంగ్రెస్‌ బాటలో అబ్బిడి రాజిరెడ్డి.. రైతు సేవలో కొత్త పయనం! - Additional Image

    వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్‌గా రైతు సంక్షేమమే లక్ష్యంగా కొత్త పయనం


    కాంగ్రెస్ అంటే నిబద్ధత.. రాజిరెడ్డి అంటే సేవా తత్వం..!

    కాంగ్రెస్‌ బాటలో అబ్బిడి రాజిరెడ్డి.. రైతు సేవలో కొత్త పయనం! - Additional Image

    జెండా కాంగ్రెస్‌దే.. ఎజెండా రైతు సంక్షేమమే..!

    పార్టీ కోసం అలుపెరగని పోరాటం..కాంగ్రెస్ జెండాతో ప్రయాణం...

    కాంగ్రెస్‌ బాటలో అబ్బిడి రాజిరెడ్డి.. రైతు సేవలో కొత్త పయనం! - Additional Image

    అబ్బిడి రాజిరెడ్డి... సేవా ప్రస్థానం

    ఇవి కూడా చదవండి

    వర్ధన్నపేట ప్రతినిధి, సెప్టెంబర్ 24 (తరంగాలు):
    వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన అబ్బిడి రాజిరెడ్డి స్థానిక రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన కాంగ్రెస్ నాయకుడిగా కొనసాగుతున్నారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం వర్ధన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టంగా నిలిచింది.

    కాంగ్రెస్‌ బాటలో అబ్బిడి రాజిరెడ్డి.. రైతు సేవలో కొత్త పయనం! - Additional Image

    కష్టకాలంలోనూ కాంగ్రెస్‌తోనే ప్రయాణం..

    అబ్బిడి రాజిరెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. 2009లో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ గెలుపు కోసం ఆయన పనిచేశారని స్థానిక కాంగ్రెస్ శ్రేణులు గుర్తుచేస్తున్నాయి. అనంతరం వర్ధన్నపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి పార్టీ కార్యక్రమాలను మండలాలు, గ్రామాల స్థాయికి తీసుకెళ్లడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు.
    పార్టీ అధికారంలో లేని సమయంలోనూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తన రాజకీయ అనుబంధాన్ని కొనసాగించారని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. దమ్మన్నపేటలో నిరుపేద కుటుంబాలకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిత్యావసర వస్తువులు, ఆర్థిక సహాయం అందజేశారు.

    ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గెలుపులో కీలకంగా..

    కాంగ్రెస్‌ బాటలో అబ్బిడి రాజిరెడ్డి.. రైతు సేవలో కొత్త పయనం! - Additional Image

    ప్రస్తుత వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎన్నిక సమయంలోనూ అబ్బిడి రాజిరెడ్డి పార్టీ కోసం పనిచేశారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు.
    కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడిగా, గ్రామస్థాయి సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లే వ్యక్తిగా ఆయనకు స్థానికంగా గుర్తింపు ఉంది.


    దమ్మన్నపేటలో కాంగ్రెస్ జెండా..

    స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ దమ్మన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఆయన ప్రత్యేకంగా పనిచేశారని అనుచరులు చెబుతున్నారు. పార్టీకి అనుకూలమైన ఫలితాన్ని సాధించేందుకు గ్రామస్థాయిలో సమన్వయం చేస్తూ కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన కీలకంగా వ్యవహరించారని వారు పేర్కొంటున్నారు.

    కాంగ్రెస్‌ బాటలో అబ్బిడి రాజిరెడ్డి.. రైతు సేవలో కొత్త పయనం! - Additional Image

    ఇప్పుడు రైతు సేవే లక్ష్యం..

    రాజకీయాల్లో పార్టీ కోసం పనిచేసిన అబ్బిడి రాజిరెడ్డికి ఇప్పుడు రైతు సేవకు సంబంధించిన మరో ముఖ్యమైన బాధ్యత లభించింది. వర్ధన్నపేట పీఏసీఎస్ నూతన చైర్మన్‌గా ఆయన ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు నూతన పాలకవర్గ సభ్యులు కూడా ప్రమాణస్వీకారం చేశారు.
    చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పీఏసీఎస్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రైతులకు సకాలంలో రుణాలు, ఎరువులు, విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు సహకార సంఘం సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.

    ఘన స్వాగతం..

    కాంగ్రెస్‌ బాటలో అబ్బిడి రాజిరెడ్డి.. రైతు సేవలో కొత్త పయనం! - Additional Image

    కార్యకర్తల్లో ఉత్సాహం
    పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్వగ్రామం దమ్మన్నపేటకు చేరుకున్న రాజిరెడ్డికి గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకగా, నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
    ఈ సందర్భంగా రాజిరెడ్డి తన తండ్రి విగ్రహానికి కుటుంబ సభ్యులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తులు, కార్యకర్తలతో మమేకమై వారి అభినందనలు స్వీకరించారు.

    అందరినీ కలుపుకొని ముందుకు..

    తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు రాజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పీఏసీఎస్ పరిధిలోని రైతులకు మెరుగైన సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు.
    రైతుల సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సొసైటీ ద్వారా అందే సేవలు పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అందరినీ కలుపుకొని పనిచేస్తూ వర్ధన్నపేట పీఏసీఎస్‌ను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని రాజిరెడ్డి స్పష్టం చేశారు.
    పార్టీ కోసం కార్యకర్తగా మొదలైన ప్రస్థానం.. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగిన బాధ్యత.. ఇప్పుడు రైతు సేవకు వేదికైన పీఏసీఎస్ చైర్మన్ పదవి.. అబ్బిడి రాజిరెడ్డి రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయానికి తెరతీసినట్లైంది.