EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బతుకమ్మకు విశ్వవేదికపై కొత్త చరిత్ర!

    Author THARANGALU NEWS | 27 Sep 2026, 10:18 AM | TELANGANA
    బతుకమ్మకు విశ్వవేదికపై కొత్త చరిత్ర!

    రెండున్నర లక్షల మందితో గిన్నిస్ రికార్డే లక్ష్యం

    తెలంగాణ సంస్కృతిని భావితరాలకు అందించే దిశగా జాగృతి అడుగులు

    బతుకమ్మకు విశ్వవేదికపై కొత్త చరిత్ర! - Additional Image

    ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో, విదేశాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తాం

    తెలంగాణ సాంస్కృతిక వికాసం.. మహిళా సాధికారత కోసం తెలంగాణ జాగృతి మరింత విస్తృతంగా పని చేస్తుంది

    బతుకమ్మకు విశ్వవేదికపై కొత్త చరిత్ర! - Additional Image

    తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత

    రాష్ట్ర కమిటీ, పలు జిల్లాల కమిటీలు, వివిధ దేశాలకు తెలంగాణ జాగృతి అధ్యక్షుల నియామకం

    తెలంగాణ జాగృతి బతుకమ్మ సంబురాలు పోస్టర్, బతుకమ్మ పాటలు సీడి ఆవిష్కరణ

    హైదరాబాద్, సెప్టెంబర్ 27,తరంగాలు ప్రతినిధి :
    వచ్చే ఏడాది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించేలా బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు పోస్టర్, తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాటల సీడిని ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వాలు గిన్నిస్ రికార్డు సాధించేలా బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు ప్రయత్నించినా అవి సఫలం కాలేదన్నారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో, విదేశాల్లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది బతుకమ్మ ఔన్నత్యాన్ని చాటేలా రెండున్నర లక్షల మందితో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని.. ఇందుకోసం గ్రామ గ్రామ బతుకమ్మ కమిటీలు, కోలాటం కమిటీలు వేస్తామన్నారు. బూర్జ్ ఖలీఫాతో సహా ప్రపంచానికి బతుకమ్మ వైభవాన్ని చాటిన స్వచ్ఛంద సంస్థగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బతుకమ్మ విజయవంతం చేస్తామన్నారు. ఈ ఏడాది జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో తెలంగాణలోని మహిళలంతా పాల్గొనాలని కోరారు. చప్పట్ల పాటలు, సాంప్రదాయ బతుకమ్మ పాటలను భావి తరాలకు అందించేందుకే చప్పట్ల పాటలతో సీడి రూపొందించామన్నారు.

    *గిన్నిస్ రికార్డ్ సాధిస్తాం – మాధవి*

    ఇవి కూడా చదవండి

    వచ్చే ఏడాది రెండున్నర లక్షల మందితో బతుకమ్మ నిర్వహించి గిన్నిస్ రికార్డ్ సాధిస్తామని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మారిపెల్లి మాధవి తెలిపారు. ఈ ఏడాది జాగృతి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు.. జాగృతి నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనాలని కోరారు. ఇప్పటికే యూట్యూబ్ లో చప్పట్ల, సాంప్రదాయ బతుకమ్మ పాటలను అప్ లోడ్ చేశామని ఆమె చెప్పారు.

    *సాంస్కృతిక వికాసం.. మహిళా సాధికారతే తెలంగాణ జాగృతి లక్ష్యం*

    తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఈ గడ్డ సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ జాగృతి స్వచ్ఛంద సంస్థ ఇక ముందు అంతకన్నా ఉత్సాహంగా పని చేయనుంది. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత జాగృతి రాష్ట్ర అధ్యక్షులుగా మారిపెల్లి మాధవిని నియమించారు. తెలంగాణ జాగృతి స్వచ్ఛంద సంస్థ పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం కోసం చేసేలా సంస్థను మరింత బలోపేతం చేయాలని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత నిర్ణయించారు. సాంస్కృతిక వికాసంతో మహిళా సాధికారత, సమాజంలోని అసమానతలు రూపుమాపేలా జాగృతి మరింత విస్తృతంగా పని చేయనుందని కవిత ప్రకటించారు. ఈ క్రమంలోని రాష్ట్రంలోని పలు జిల్లాలు, వివిధ దేశాలకు కమిటీలను ప్రకటించారు. మిగిలిన జిల్లాల కమిటీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

    *తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ*

    అధ్యక్షులు మారిపెల్లి మాధవి,ఉపాధ్యక్షులు జాడి శ్రీనివాస్, పర్శ చంద్రశేఖర్,
    ప్రధాన కార్యదర్శి గుంటి సుందర్,కార్యదర్శులు కన్నం శారద, దొండి స్వర్ణలత, మస్తాన్
    మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు మానుకోట సునీత.

    *వివిధ జిల్లాల అధ్యక్షులు

    జగిత్యాల పట్టూరి తిరుపతి,
    రంగారెడ్డి ఎండీ మొయినుద్దీన్,
    వరంగల్ పొలుదాసరి రమేశ్,
    హన్మకొండ నెట్టి రజిత,
    మహబూబ్ నగర్ ఏర్పుల నర్సింలు,
    సూర్యాపేట లక్కపాక ప్రవీణ్,
    భూపాలపల్లి గుమ్మడి రవీందర్,
    నిజామాబాద్ అవంతి కుమార్,పెద్దపల్లి మేడారపు రాజ్యలక్ష్మీ,కరీంనగర్ గుండు మంజుల,
    కామారెడ్డి రెడ్డిపేట సతీశ్ కుమార్ ను నియమించారు.

    *తెలంగాణ జాగృతి మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వేణుగోపాల్ యాదవ్*

    *జాగృతి వివిధ దేశాల అధ్యక్షులు*

    న్యూజిలాండ్ అధ్యక్షులు ముద్దం అరుణ జ్యోతి,
    ఖతార్ అధ్యక్షులు ప్రవీణ లక్ష్మీ,ఖతార్ ప్రధాన కార్యదర్శి ఆదర్శ రెడ్డి పోతుల,యూఎస్ఏ అధ్యక్షులు రాజ్ గోవిల్కర్,
    ఓమన్ అధ్యక్షులు గుండు రాజేందర్ నేత,
    కెనాడా అధ్యక్షులు కుందె రాఘవేంద్ర యాదవ్,
    ఐర్లాండ్ అధ్యక్షులు సంతోష్ పల్లె,
    స్విట్జర్లాండ్ అధ్యక్షులు కిశోర్ తాటికొండ,
    ఇటలీ అధ్యక్షులు సౌమ్య పిన్నంరెడ్డి,
    నార్వే అధ్యక్షులు కిరణ్ తేజ సూధటి,
    నార్వే ప్రధాన కార్యదర్శి నిఖిత బిల్లకంటి,
    జింబాబ్వే అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గౌడ్,
    కెన్యా అధ్యక్షులు గంట్ల స్వప్నా రెడ్డి ను నియమించారు.