EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రెడ్ క్రాస్ వరంగల్ జిల్లా చైర్మన్‌గా భేతి అశోక్ బాబు

    Author THARANGALU NEWS | 28 Sep 2026, 10:19 PM | TELANGANA
    రెడ్ క్రాస్ వరంగల్ జిల్లా చైర్మన్‌గా భేతి అశోక్ బాబు

    వైస్ చైర్మన్‌గా శానబోయిన రాజకుమార్.. ట్రెజరర్‌గా బొల్లం శివ

    స్టేట్ ఎంసీ మెంబర్‌గా నాడెం శాంతికుమార్ ఎన్నిక

    రెడ్ క్రాస్ వరంగల్ జిల్లా చైర్మన్‌గా భేతి అశోక్ బాబు - Additional Image

    వరంగల్ ప్రతినిధి , సెప్టెంబర్ 28 (తరంగాలు): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వరంగల్ జిల్లా శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు సోమవారం ఏకగ్రీవంగా జరిగాయి. జిల్లా చైర్మన్‌గా భేతి అశోక్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా శానబోయిన రాజకుమార్, ట్రెజరర్‌గా బొల్లం శివ, స్టేట్ ఎంసీ మెంబర్‌గా నాడెం శాంతికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
    అలాగే రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులుగా కుసుమ సత్యనారాయణ (రిటైర్డ్ తహసీల్దార్), తోట సంపత్ (రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు), మండల పరుషరాములు (ఎన్‌జీఓ), మామిడాల రమేష్ బాబు (అడ్వకేట్), వద్ది రాజు ( టీఎన్జీవో ), చొప్పరి సోమయ్య ( ఎన్జీవో), ముల్క ప్రసాద్, పుల్లూరి వేణు (న్యాయవాది), డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి, మోతె తిరుపతి రెడ్డి, డాక్టర్ గజవెల్లి రాజకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
    నూతనంగా ఎన్నికైన చైర్మన్ భేతి అశోక్ బాబు, ఇతర పదవుల ప్రతినిధులు, మేనేజింగ్ కమిటీ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రతినిధులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా ప్రెసిడెంట్, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
    రెడ్ క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేసేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.

    ఇవి కూడా చదవండి