EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వయోవృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి

    Author THARANGALU NEWS | 29 Sep 2026, 06:16 PM | TELANGANA
    వయోవృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి

    ఏనుగల్లు గ్రామ సర్పంచ్ తొర్రి పద్మ యాదవ్


    పర్వతగిరి, సెప్టెంబర్ 29 (తరంగాలు ప్రతినిధి ):వయోవృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని
    ఏనుగల్లు గ్రామ సర్పంచ్ తొర్రి పద్మ యాదవ్ అన్నారు.పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో అంగన్వాడీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ తొర్రి పద్మ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
    ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. వయోవృద్ధులు కుటుంబానికి, సమాజానికి విలువైన మార్గదర్శకులని, వారి అనుభవాలు భావితరాలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ ఆప్యాయత, గౌరవంతో వ్యవహరించడంతో పాటు వారి ఆరోగ్యం, భద్రత, అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వృద్ధులు ఒంటరితనానికి గురికాకుండా కుటుంబ సభ్యులు వారికి అండగా నిలవాలని సూచించారు.
    అనంతరం వృద్ధులను ఆత్మీయంగా పలకరించి, కేక్ కట్ చేయించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అరుణ,వినోద, అనిత, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

    వయోవృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి - Additional Imageవయోవృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి - Additional Imageవయోవృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి - Additional Image