EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రైతులకు సేవలందించడమే పీఏసీఎస్‌ల లక్ష్యం కావాలి

    Author THARANGALU NEWS | 30 Sep 2026, 03:39 PM | TELANGANA
    రైతులకు సేవలందించడమే పీఏసీఎస్‌ల లక్ష్యం కావాలి

    నూతన పాలకవర్గం రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి

    ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు

    రైతులకు సేవలందించడమే పీఏసీఎస్‌ల లక్ష్యం కావాలి - Additional Image

    — నూతన చైర్మన్‌ పింగళి వెంకటరెడ్డికి ఘన సన్మానం

    ఇవి కూడా చదవండి

    హసన్‌పర్తి, సెప్టెంబర్‌ 30 (తరంగాలు): రైతులకు సేవలందించడమే పీఏసీఎస్‌ల లక్ష్యం కావాలని,నూతన పాలకవర్గం రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని వర్ధన్నపేట
    ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు.హసన్‌పర్తి పీఏసీఎస్‌ సర్వసభ్య సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి కేఆర్‌ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పీఏసీఎస్‌ చైర్మన్‌ పింగళి వెంకటరెడ్డితో పాటు నూతన పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నప్పటికీ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. విత్తనాలు, ఎరువులు, సాగునీరు, పంటల కొనుగోలు వంటి అంశాల్లో రైతులకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
    రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఎమ్మెల్యే సూచించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సహకార సంఘాల ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందేలా నూతన పాలకవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.
    పీఏసీఎస్‌లు రైతులకు ఆర్థికంగా, వ్యవసాయపరంగా అండగా నిలిచే కీలక సంస్థలని పేర్కొన్న ఎమ్మెల్యే, రైతులకు రుణాలు, వ్యవసాయ అవసరాలకు సంబంధించిన సేవలు సకాలంలో అందేలా పాలకవర్గం పనిచేయాలని సూచించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
    ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ నూతన చైర్మన్‌ పింగళి వెంకటరెడ్డి, పాలకవర్గ సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ వైస్‌ చైర్మన్‌ నిమ్మాని శేఖర్‌ రావు, 66వ డివిజన్‌ అధ్యక్షుడు గొర్రె కిరణ్‌, ఎనుమాముల మార్కెట్‌ డైరెక్టర్‌ రైతు రాజు, మల్లారెడ్డిపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ కుమార్‌, జిల్లా, మండల, డివిజన్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

    రైతులకు సేవలందించడమే పీఏసీఎస్‌ల లక్ష్యం కావాలి - Additional Imageరైతులకు సేవలందించడమే పీఏసీఎస్‌ల లక్ష్యం కావాలి - Additional Image