EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మంచి మిత్రుడిని కోల్పోవడం బాధాకరం

    Author THARANGALU NEWS | 01 Oct 2026, 07:36 PM | TELANGANA
    మంచి మిత్రుడిని కోల్పోవడం బాధాకరం

    టెన్నిస్ కోర్టులో మొదలైన స్నేహం.. ఆత్మీయ బంధంగా మారింది

    డాక్టర్ కుందూరు వెంకటరెడ్డి మృతి పట్ల ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సంతాపం

    మంచి మిత్రుడిని కోల్పోవడం బాధాకరం - Additional Image

    వరంగల్ ప్రతినిధి, అక్టోబర్ 1 (తరంగాలు):
    సుబేదారి ఆఫీసర్స్ క్లబ్ సభ్యుడు, తనతో కలిసి టెన్నిస్ ఆడే ఆత్మీయ మిత్రుడు డాక్టర్ కుందూరు వెంకటరెడ్డి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు.
    డాక్టర్ కుందూరు వెంకటరెడ్డి మృతదేహాన్ని గురువారం ఆయన నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సందర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. డాక్టర్ కుందూరు వెంకటరెడ్డితో సుబేదారి ఆఫీసర్స్ క్లబ్‌లో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం టెన్నిస్ ఆట ద్వారా మరింత ఆత్మీయ స్నేహంగా మారిందని తెలిపారు. ఆయనతో కలిసి టెన్నిస్ ఆడిన జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.డాక్టర్ కుందూరు వెంకటరెడ్డి మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఒక మంచి మిత్రుడిని కోల్పోవడం ఎంతో బాధాకరమని అన్నారు. ఆయనతో ఉన్న స్నేహబంధాన్ని, ఆత్మీయతను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
    డాక్టర్ కుందూరు వెంకటరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని ఎదుర్కొనే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రార్థించారు.

    ఇవి కూడా చదవండి

    మంచి మిత్రుడిని కోల్పోవడం బాధాకరం - Additional Image