EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగాలి

    Author THARANGALU NEWS | 04 Oct 2026, 09:21 AM | TELANGANA
    కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగాలి

    ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

    టి డబ్ల్యూ – ఎస్ డబ్ల్యూ ఎఫ్ – ఐఎన్టీయూసీ కూటమికి సంపూర్ణ మద్దతివ్వండి

    కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగాలి - Additional Image

    కార్మికుల సమస్యలు నా దృష్టికి తీసుకురండి.. పరిష్కారానికి కృషి చేస్తా
    ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

    ఇవి కూడా చదవండి

    హనుమకొండ, అక్టోబర్ 4 (తరంగాలు):
    ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. ఆర్టీసీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఉదయం హనుమకొండ లోకల్ డిపోలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
    ఈ సందర్భంగా టి డబ్ల్యూ , స్వప్ , ఐ ఎన్ టి యు సి ఐక్య కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులను ఎమ్మెల్యే కోరారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత, మెరుగైన పని పరిస్థితుల కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
    కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
    ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్మికుల ఐక్యత, సంక్షేమం కోసం పనిచేస్తున్న TWU–SWF–INTUC ఐక్య కూటమికి సంపూర్ణ మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు.
    ఈ కార్యక్రమంలో వరంగల్ డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

    కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగాలి - Additional Imageకార్మికుల హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగాలి - Additional Image