EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అంగన్‌వాడీల సేవలు అభినందనీయం.. శిల్పారెడ్డి

    Author THARANGALU NEWS | 06 Oct 2026, 04:29 PM | TELANGANA
    అంగన్‌వాడీల సేవలు అభినందనీయం.. శిల్పారెడ్డి

    సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా మడికొండలో ‘అంగన్ మిలన్ సేవా’..

    మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంగన్‌వాడీ సిబ్బందికి ఘన సత్కారం

    అంగన్‌వాడీల సేవలు అభినందనీయం.. శిల్పారెడ్డి - Additional Image


    వరంగల్ ప్రతినిధి, అక్టోబర్ 06 (తరంగాలు): అంగన్‌వాడీ సిబ్బంది చిన్నారులు, మహిళల సంక్షేమం కోసం అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణలో నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా మడికొండ డివిజన్‌లో నిర్వహించిన ‘అంగన్ మిలన్ సేవా’ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.వర్ధన్నపేట నియోజకవర్గంలోని మడికొండ డివిజన్‌లో మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శైలశ్రీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంట రవికుమార్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వందల వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, పాల్గొని కార్యక్రమానికి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నారుల పోషణ, ఆరోగ్యం, ప్రాథమిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. సమాజానికి అంకితభావంతో సేవలందిస్తున్న అంగన్‌వాడీ సిబ్బందిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘అంగన్ మిలన్ సేవా’ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
    అంగన్‌వాడీ సిబ్బంది చేస్తున్న సేవలను గుర్తించిన శిల్పారెడ్డి, వారి కృషిని అభినందించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవలందిస్తున్న సిబ్బందిని బీజేపీ నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.
    ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బన్న ప్రభాకర్, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు మంజులరెడ్డి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రేణుక, రాష్ట్ర నాయకులు జలగం రంజిత్, జిల్లా కార్యదర్శి వెంకట్‌రావు, గడ్డం మహేందర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి