EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు చొరవతో "ఒక్కటైన ప్రేమజంట"

    Author THARANGALU NEWS | 08 Oct 2026, 10:23 PM | TELANGANA
    ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు చొరవతో  "ఒక్కటైన ప్రేమజంట"

    ఇరువర్గాల కుటుంబాలతో చర్చలు.. వివాహానికి ఒప్పించిన ఎమ్మెల్యే

    నాలుగు రోజుల శ్రీదేవి దీక్షకు తెర.. శ్రీకాంత్ కుటుంబం అంగీకారం

    ప్రేమ వివాహం చేసుకున్న ఎమ్మెల్యే.. ప్రేమికుల పక్షాన నిలిచిన నాయకుడు

    నూతన వధూవరులకు నూతన వస్త్రాలు అందజేసి ఆశీర్వదించిన ఎమ్మెల్యే నాగరాజు-మల్లీశ్వరి దంపతులు

    ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు చొరవతో  "ఒక్కటైన ప్రేమజంట" - Additional Image

    వర్ధన్నపేట ప్రతినిధి, అక్టోబర్ 08, (తరంగాలు) ప్రియుడు శ్రీకాంత్‌తో వివాహం జరిపించాలని కోరుతూ నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న దళిత యువతి శ్రీదేవి ఆందోళనకు ఎట్టకేలకు ముగింపు లభించింది. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కే.ఆర్. నాగరాజు ప్రత్యేక చొరవతో శ్రీకాంత్, ఆయన కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించారు.
    ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు ఆధ్వర్యంలో ఇరువర్గాల కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు కృషి చేశారు. ఎమ్మెల్యే చొరవతో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకారం తెలపడంతో నాలుగు రోజులుగా కొనసాగుతున్న శ్రీదేవి దీక్షకు ముగింపు పలికారు.ఈ సందర్భంగా శ్రీకాంత్–శ్రీదేవి పరస్పరం వివాహ దండలు మార్చుకుని తమ వివాహ బంధానికి శ్రీకారం చుట్టారు. దీంతో అక్కడి వాతావరణం ఆనందోత్సాహాలతో నిండిపోయింది. దళిత సంఘాల ప్రతినిధులు, మహిళలు, కుటుంబ సభ్యులు, వర్ధన్నపేట పట్టణవాసులు ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు చొరవను అభినందించారు.అనంతరం ఎమ్మెల్యే నివాసానికి వచ్చిన నూతన దంపతులను ఎమ్మెల్యే నాగరాజు వారి సతీమణి మల్లీశ్వరి నూతన వధూవరులకు పెళ్లి వస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు.

    ఇవి కూడా చదవండి

    *ప్రేమ వివాహం చేసుకున్న ఎమ్మెల్యే.. ప్రేమికుల పక్షాన నిలిచిన నాయకుడు*

    ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు చొరవతో  "ఒక్కటైన ప్రేమజంట" - Additional Image

    తాను కూడా ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తిగా ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు ప్రేమ, వివాహం విషయంలో ఎదురయ్యే ఇబ్బందులను అర్థం చేసుకుని ఈ యువజంటకు అండగా నిలిచారు. యువతి నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి, ఇరువర్గాలతో మాట్లాడి వివాహానికి మార్గం సుగమం చేశారు.“ప్రేమించిన ఇద్దరు యువతీ యువకులు తమ జీవితాన్ని కలిసి కొనసాగించాలనుకుంటే, కుటుంబాల మధ్య అపార్థాలు ఉండకూడదు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుని వారి భవిష్యత్తుకు అండగా నిలవాలి” అనే దృక్పథంతో ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు వ్యవహరించారు.ఎమ్మెల్యే చొరవతో నాలుగు రోజులుగా కొనసాగిన శ్రీదేవి దీక్షకు తెరపడటంతో కుటుంబ సభ్యులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రేమజంటకు వివాహం జరగడంతో “ఎట్టకేలకు శ్రీదేవికి న్యాయం జరిగింది” అంటూ పలువురు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్, ఇల్లంద మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,ఐనవోలు దేవస్థానం చైర్మన్ ప్రభాకర్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి, మండల అధ్యక్షులు పోశాల వెంకన్న గౌడ్ ,1వ డివిజన్ అధ్యక్షులు చిర్ర రాము గౌడ్, సీనియర్ నాయకులు బుద్దే పెద్దన్న,వర్ధన్నపేట మండల యూత్ అధ్యక్షులు భాను ప్రసాద్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.