EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి!

    Author THARANGALU NEWS | 28 Oct 2026, 06:24 PM | TELANGANA
    మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి!

    ఆరోగ్యవంతమైన యువతతోనే వికసిత్ భారత్–2047 సాధ్యం

    విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి..

    మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి! - Additional Image

    దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

    ఇవి కూడా చదవండి


    వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

    వక్తృత్వ,వ్యాసరచన పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన

    జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు

    వరంగల్, అక్టోబర్ 28 (తరంగాలు ప్రతినిధి): మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, చదువుపై దృష్టి సారించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్, భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సత్య శారద విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన యువతతోనే వికసిత్ భారత్–2047 లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.
    భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రారంభించారు.
    ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీయడంతోపాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. యువత ఆరోగ్యంగా, క్రమశిక్షణతో ఎదిగినప్పుడే దేశ ప్రగతికి బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యువతకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ సందేశం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు బహుమతులు అందజేశారు.కార్యక్రమం ముగింపులో విద్యార్థినీ విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, వాటి దుష్ప్రభావాలపై ఇతరులకు అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని ప్రతినబూనారు.ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు, వైస్ చైర్మన్ శనబోయిన రాజ్‌కుమార్, సలహాదారులు ఈవీ శ్రీనివాసరావు, కోశాధికారి బొల్లం శివ, రాష్ట్ర మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుడు నడెం శాంతికుమార్, మేనేజింగ్ కమిటీ సభ్యులు మండల పరశురాములు, తోట సంపత్ కుమార్, మామిడాల రమేష్ బాబు, డాక్టర్ రాజ్‌కుమార్, తిరుపతిరెడ్డి, ముల్క ప్రసాద్, కళాశాల డైరెక్టర్లు సీహెచ్ వాణి, విశ్వాంబర్ రెడ్డి, అధ్యాపకులు ఎండీ అజం, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.