EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఓటు చోరీపై ఢిల్లీకి యువజన కాంగ్రెస్ దండయాత్ర!

    Author THARANGALU NEWS | 31 Oct 2026, 10:28 AM | TELANGANA
    ఓటు చోరీపై ఢిల్లీకి యువజన కాంగ్రెస్ దండయాత్ర!

    నవంబర్ 1న రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీ

    ▪ కేఆర్ దిలీప్ రాజ్ ఆధ్వర్యంలో వరంగల్ యువజన కాంగ్రెస్ శ్రేణుల పయనం

    ▪ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని నేతల స్పష్టీకరణ

    ఇవి కూడా చదవండి


    వరంగల్, అక్టోబర్ 31, (తరంగాలు ప్రతినిధి):

    ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా వరంగల్ అర్బన్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి బయలుదేరాయి. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న భారీ ర్యాలీలో పాల్గొనేందుకు నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.

    *ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం*

    ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బొక్కల ప్రమోద్, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకుడు బిర్రు రాజు, వర్ధన్నపేట మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కుల్ల యాకాంతం తదితరులు పాల్గొన్నారు.