EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వర్ధన్నపేట రైతు వేదికలో ఘనంగా విత్తన మేళా నిర్వహణ

    Author THARANGALU NEWS | 27 Jul 2026, 02:32 PM | TELANGANA
    వర్ధన్నపేట రైతు వేదికలో ఘనంగా విత్తన మేళా నిర్వహణ

    వర్ధన్నపేట ప్రతినిధి , జూలై 27, తరంగాలు :
    వర్ధన్నపేట రైతు వేదికలో సోమవారం విత్తన మేళా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య మరియు స్థానిక తహసీల్దార్ విద్యాసాగర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎద్దు సత్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
    ఈ సందర్భంగా మండలంలోని వివిధ ఎరువులు, విత్తనాల డీలర్లు తమ సంస్థల ద్వారా అందుబాటులో ఉన్న నాణ్యమైన విత్తనాలను ప్రదర్శించారు. ముఖ్యంగా పెసర, కంది, మినుములు, బొబ్బర్లు వంటి పప్పుధాన్యాల విత్తనాలతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రైతులకు పరిచయం చేశారు.
    ఈ సందర్భంగా నరకుడు వెంకటయ్య, పోశాల వెంకన్న గౌడ్, ఎద్దు సత్యం మాట్లాడుతూ, ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం సూచించిన మేరకు వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని తెలిపారు.
    వర్షాభావ పరిస్థితులను తట్టుకునే కంది, పెసర, అలసంద, మినుములు వంటి పప్పుధాన్యాలతో పాటు జొన్న, కొర్రలు, అండ్రు కొర్రలు, రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలు, అలాగే ఉలవలు, కుసుమ, ఆముదం వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. అలాగే ఉద్యానవన శాఖ ద్వారా కూరగాయల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
    ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు గుజ్జ సోమేశ్వరరావు, భూక్యా సంతోష్, తోటకూరి శ్రీనివాస్, గుంటి కుమారస్వామి, ప్రజాప్రతినిధులు మరియు మండలంలోని పలువురు రైతులు పాల్గొన్నారు.

    వర్ధన్నపేట రైతు వేదికలో ఘనంగా విత్తన మేళా నిర్వహణ - Additional Image