EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కేసముద్రంలో కదం తొక్కిన గీతన్నలు!

    Author THARANGALU NEWS | 03 Aug 2026, 06:39 PM | TELANGANA
    కేసముద్రంలో కదం తొక్కిన గీతన్నలు!

    వేలాది మంది గౌడన్నల గర్జన.. జనసంద్రంగా “గీతన్నల చైతన్య యాత్ర”

    కేజీ కేఎస్ రాష్ట్ర బృందానికి గజమాలతో ఘన స్వాగతం పలికిన గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్

    కేసముద్రంలో కదం తొక్కిన గీతన్నలు! - Additional Image

    గీత అన్నలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి

    రాష్ట్ర అధ్యక్షులు రమణ, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు

    కేసముద్రంలో కదం తొక్కిన గీతన్నలు! - Additional Image

    1200 బైక్‌లు.. 2,000 మందికి పైగా గీత కార్మికులు, యువతతో భారీ ర్యాలీ

    కేసముద్రంలో కదం తొక్కిన గీతన్నలు! - Additional Image

    ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలి..

    ఇవి కూడా చదవండి

    పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

    కేసముద్రంలో కదం తొక్కిన గీతన్నలు! - Additional Image

    కేజీ కేఎస్ రమణ ప్రతిపాదించిన డిమాండ్లను వేం నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా - సమ్మయ్య గౌడ్

    కేసముద్రం, ఆగస్టు 3, తరంగాలు ప్రతినిధి :
    గీత కార్మికుల హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన “అమరుల యాదిలో.. గీతన్నల చైతన్య యాత్ర” కేసముద్రంలో సోమవారం హోరెత్తింది. మహబూబాబాద్ జిల్లాలో సోమవారం ప్రారంభమైన చైతన్య యాత్రలో భాగంగా నిర్వహించిన భారీ బైక్ ర్యాలీకి మండలంలోని దాదాపు అన్ని గ్రామాల నుంచి గౌడన్నలు, గీత కార్మికులు, యువత భారీగా తరలివచ్చారు. సుమారు 1200 ద్విచక్ర వాహనాలు, 2,000 మందికి పైగా పాల్గొనడంతో కేసముద్రం జనసంద్రంగా మారింది.

    *గీతన్నల హక్కుల కోసం గళమెత్తిన నేతలు*

    కేజీకేఎస్ మండల అధ్యక్షులు బబ్బూరి ఉప్పలయ్య, కార్యదర్శి మేడం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ అధ్యక్షతన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కేజీకేఎస్ రాష్ట్ర బృందానికి గజమాలతో ఘన స్వాగతం పలికిన అనంతరం బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ఫ్లైఓవర్ మీదుగా అంబేద్కర్ సెంటర్‌కు చేరుకున్న ర్యాలీ అక్కడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి, అనంతరం జ్యోతిరావు ఫూలే సెంటర్‌లో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించింది.

    కేసముద్రంలో కదం తొక్కిన గీతన్నలు! - Additional Image


    *ప్రభుత్వం వెంటనే స్పందించాలి*

    రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గీత కార్మికుల సమస్యలను గ్రామస్థాయి నుంచి తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ చైతన్య యాత్ర చేపట్టినట్లు తెలిపారు. గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వారి సంక్షేమానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

    కేసముద్రంలో కదం తొక్కిన గీతన్నలు! - Additional Image

    గీతన్నల ప్రధాన డిమాండ్లు ఇవే..

    ఎక్స్‌గ్రేషియాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి.
    ప్రమాదవశాత్తు మృతి చెందిన గీత కార్మికుల కుటుంబాలకు పెండింగ్ ఎక్స్‌గ్రేషియా బకాయిలు వెంటనే చెల్లించాలి.
    తాటి, ఈత చెట్లు ఎక్కడానికి రక్షణ కిట్లు, భద్రతా పరికరాలు పూర్తిస్థాయిలో అందించాలి.
    జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి.
    ప్రమాదాలకు గురయ్యే గీత కార్మికులకు మెరుగైన భద్రతా సౌకర్యాలు, కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలి.
    హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి.


    గీతన్నలకు అండగా ఉంటా-గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్

    గీత కార్మికుల హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం కేజీకేఎస్ రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదించిన డిమాండ్లకు తన పూర్తి మద్దతు ఉంటుందని గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్
    తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ సహకారంతో కేసముద్రం గడ్డ ముద్దుబిడ్డ, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి, వారి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
    గౌడ సమాజం విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయాలు, ఆర్థిక రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలకు మెరుగైన విద్య, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి గౌడ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా గీత కార్మికులు, యువత, వివిధ సంఘాల ప్రతినిధులు ఐక్యంగా ముందుకు సాగాలని, ఐక్యతతోనే హక్కులు సాధించుకోగలమని పిలుపునిచ్చారు.
    ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గౌని వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు బన్నీ వెంకట మల్లయ్య, వి. వెంకట నరసయ్య, గౌని సాంబయ్య, చౌగాని సీతారాములు, ఎస్. రమేష్ గౌడ్, ఎస్. వెంకట్ గౌడ్, యమగాని వెంకన్న, గోడం వెంకటేశ్వర్లు, పానుగంటి వీరస్వామి, బుర్ర సుధాకర్, తాళ్లపల్లి నర్సయ్య, బాలబోయిన రాంబాబు, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ రాజేష్తో పాటు మండలంలోని వివిధ గ్రామాల నాయకులు, గౌడ యువజన నాయకులు, గీత కార్మికులు, గౌడ సంఘాల ప్రతినిధులు, బహుజన కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.